![]() |
![]() |

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అందరికి సుపరిచితమే. ఒక కామన్ మ్యాన్ గా సీసన్ 7లొకి ఎంట్రీ ఇచ్చి టైటిల్ విన్నర్ కావడం అంటే మాములు విషయం కాదు హిస్టరీని క్రియేట్ చేసాడు అనే చెప్పాలి.... రైతుబిడ్డగా మంచి ఆదరణ పొందిన ప్రశాంత్ విన్నర్ అయి బయటకు వచ్చాక ఫ్యాన్స్ చేసిన న్యూసెన్స్ వాళ్ళ చాల ఇబ్బందే పడ్డాడు.
ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో విజేతలంతా సెలెబ్రిటీలే ఫస్ట్ టైమ్ కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లాపూర్ గ్రామంలో పుట్టాడు ప్రశాంత్. డిగ్రీ పూర్తి చేసాక ఓ యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో ఫోక్స్ సాంగ్స్ తో నెటిజన్లకి దగ్గరయ్యాడు. యూట్యూబర్ గా ఫోక్స్ సాంగ్స్ క్రియేటర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. యూట్యూబ్ ఛానెల్ విషయంలో ఫ్రెండ్స్ తో గొడవలు జరిగాయి. ఇక ఆ గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్.. ఓ దశలో చనిపోవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రులిచ్చిన ధైర్యంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక వ్యవసాయంలో నాన్నకి సాయంగా ఉన్నాడు. ఆ తర్వాత వ్యవసాయంలో రైతులు పడే ఇబ్బందులని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో యూట్యూబ్ లలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక బిగ్ బాస్ కి వెళ్ళాలనే కలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడంట ప్రశాంత్. ఒకానొక దశలో నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళడమేంట్రా అని అతని స్నేహితులు ఎగతాళి చేసేవారంట. ఇక కసితో ప్రయత్నించి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రెండవ వారమే అమర్ దీప్ వర్సెస్ ప్రశాంత్ కి జరిగిన నామినేషన్ గొడవలో అమర్ దీప్ రైతులని తక్కువ చేసి మాట్లాడటంతో అతనికి తీవ్రంగా నెగెటివిటి వచ్చి ప్రశాంత్ కి పాజిటివ్ అయ్యింది. ఇక ఆ తర్వాత హౌస్ లో ఏ టాస్క్ ఇచ్చిన, ఏ గేమ్ ఇచ్చిన గెలుపు కోసం తన వంద శాతం ఇచ్చాడు. శివాజీ సపోర్ట్ తో ఎవరితో ఎలా ఉండాలో ? ఎలా డిఫెండ్ చేసుకోవాలో నేర్చుకున్న ప్రశాంత్ టైటిల్ గెలుపులో సీరియల్ బ్యాచ్ తో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక టాప్-5 లో ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, యావర్, ప్రియాంక జైన్ ఉన్నారు. ఫైనల్లో అమర్ దీప్ రన్నర్ గా ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. ఇక తాజాగా ప్రశాంత్ తనికెళ్ళ భరణిని కలిసాడు. సీనీ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా తనికెళ్ళ భరణి తెలుగు సినిమా ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్నారు. తనికెళ్ళ భరణిని ప్రశాంత్ కలిసాడు. కడుపునిండా తింటున్నామంటే రైతులు, కంటినిండా నిద్రపోతున్నామంటే సైనికులే కారణం.. అందుకే వారిని బ్రతకనివ్వాలి. వారు లేకుంటే మనం లేము. జై జవాన్ జై కిసాన్ అంటు తనికెళ్ళ భరణి తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |